కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు టూ టౌన్ పోలీస్ లో మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిఐ లు మాట్లాడుతూ గతంలో బ్రిటిష్ కాలం నుండి ఐ.పీ.ఎస్ సెక్షన్ (ఇండియన్ పీనల్ కోడ్) ఉండేదని జులై 1వ తేదీ నుండి భారత దేశంలోని న్యాయ వ్యవస్థలో మోడీ ప్రభుత్వం బి ఎన్ ఎస్ (భారతీయ న్యాయ సమితి ) సెక్షన్లను అమలులో తెచ్చిందని దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఉద్దేశంతో సీఐ విజయలక్ష్మి సిఐ గోపి స్థానికులకు వివరించి కొత్త చట్టాలపై అవగాహన పెంచారు. ఈ సదస్సులో ఆటో యూనియన్ డ్రైవర్లు టీచర్లు స్థానికులు పాల్గొన్నారు.