ముంబైలో T20 వరల్డ్ కప్ విజేతలకు విజయోత్సవ ర్యాలీకి భారీ సంఖ్యలో అభిమానులు పాలుగోని ఘన స్వాగతం పలికారు. టీ20 ప్రపంచకప్ లో విజయం సాధిచిన టీమ్ ఇండియా ముంబైకి చేరుకోవడంతో అభిమానుల ఆనందానికి ఆకాశ మే హద్దు అన్నట్లు కనిపించింది. ముంబై నగరంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఓపెన్-టాప్ బస్ పై వాంఖడే స్టేడియం వరకు విజేతలకు బ్రహ్మరథం పట్టారు. ఈ విజయోత్సవ ర్యాలీ కనుల పండగగా సాగింది.

విజేతలకు బ్రహ్మరథం పట్టిన ముంబై అభిమానులు

ప్రపంచక విజేతలకు స్వాగతం పలకడానికి అభిమానులు మధ్యాహ్నం నుండే భారత జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ ముంబై మొత్తం పండగ వాతావరణం నెలకొంది.టీం ఇండియా రావడానికి ఆలస్యంమైన అభిమానుల్లో ఉత్సాహం తగ్గలేదు. అభిమానులు “ముంబయి కా రాజా, రోహిత్ శర్మ” నినాదాలతో హోరెత్తించి సంబరాలు జరుపుకున్నారు.

ముంబైలో టీం ఇండియా విజయోత్సవ ర్యాలీ

గతంలో భారతదేశం 2007 మరియు 2011లో ప్రపంచ కప్ వచినప్పుడు విజయోత్స వాలను జరుపుకున్న ఐకానిక్ వాంఖడే స్టేడియంలో ఇండియా టీం రాకముందే స్టేడియం అభిమానులతో నిండిపోయింది. స్టేడియం లోపల విద్యుద్దీపాలతో వెలిగిపోయింది.

కప్పును చూపిస్తున్న టీం ఇండియా
ముంబైలో టీం ఇండియా విజయోత్సవ ర్యాలీ
ముంబైలో టీం ఇండియా విజయోత్సవ ర్యాలీ
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *