ఆదోని పట్టణ సమగ్ర అభివృద్ధి సాధించాలంటే కమర్షియల్ భవనాల నిర్మాణాల్లో ప్రతి ఒక్కరూ మున్సిపల్ నిబంధనలు, పట్టణ ప్రణాళిక ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్థానిక శాసనసభ్యులు డా. పి.వి. పార్థసారథి వాల్మీకి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదోనిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వంతెన ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాల వల్ల పట్టణంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవనాల నిర్మాణ సమయంలో అవసరమైన సెట్‌బ్యాక్‌లు వదలకుపోవడం, ప్రజా వినియోగ స్థలాలను ఆక్రమించడం వల్ల రహదారులు ఇరుకుగా మారుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, తాగునీటి పైప్‌లైన్ల నిర్వహణ కూడా మున్సిపల్ అధికారులకు పెద్ద సవాలుగా మారిందని వివరించారు.

హోటల్ యజమానిని పరిగణిస్తున్న ఎమ్మెల్యే

చట్టబద్ధమైన అనుమతులు తప్పనిసరి: కమర్షియల్ కాంప్లెక్స్‌లు, భవనాలు నిర్మించేవారు ప్రజా ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత అధికారుల నుండి చట్టబద్ధమైన అనుమతులు పొందిన తర్వాతే, పట్టణ ప్రణాళికకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.

బట్టల షాప్ యజమానులను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే

ప్రజల సహకారం కోరిన ఎమ్మెల్యే: ఆదోని పట్టణ ప్రజలకు మెరుగైన రహదారులు, సమర్థవంతమైన మురుగునీటి పారుదల వ్యవస్థ, నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందన్నారు. పట్టణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. పట్టణాన్ని సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ మున్సిపల్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. పి.వి. పార్థసారథి వాల్మీకి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *