27. 07. 2024 6pm నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు
4లక్ష 12వేల 28 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 866.40 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం 127.5950 టీఎంసీలు ఉన్నట్లు అధికారి తెలిపారు.
కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.
ఇన్ ఫ్లో : 4,12,280 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 53,795 క్యూసెక్కులు
పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 866.40 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 127.5950 టీఎంసీలు