కర్నూలు జిల్లా..
◆ ఆదోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగి హల్చల్..
◆ ఆసుపత్రి సిబ్బంది, పరికారాలపై వీరంగం , వైద్య పరికరాలు ధ్వంసం..
◆ రోగిని స్థంభానికి కట్టేసిన ఆసుపత్రి
సెక్యూరిటీ సిబ్బంది..
◆ రోగి ఆరేకల్ గ్రామానికి చెందిన రాఘవేంద్ర
◆ గత కొంతకాలంగా మతిస్థిమితం లేదన్న కుటుంబ సభ్యులు..
◆ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు..

జనరల్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగి హల్చల్..

కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించి అడ్డుపడిన సిబ్బంది పై విరుచుకుపడి ఆస్పత్రి వైద్య పరికరాలను ధ్వంసం చేసి భయానక వాతావరణం సృష్టించాడు.
బాధితుడి బాబాయి లక్ష్మన్న తెలిపిన వివరాల మేరకు ఆరేకల్ గ్రామానికి చెందిన రాఘవేంద్ర (30) అనే వ్యక్తికి గత వారం రోజులుగా మానసిక పరిస్తితి సరిగా లేక పోవడంతో చికిత్స నిమిత్తం

రోగిని స్థంభానికి కట్టేసిన ఆసుపత్రి
సెక్యూరిటీ సిబ్బంది
వీడియో

ఈ రోజు ఉదయం ఆదోని జనరల్ ఆసుపత్రికి తీసుకునివచ్చారు. క్యాజువాలిటీ వార్డులో తనకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది నీ చూసి భయానికి గురైన రాఘవేంద్ర కేకలు వేస్తూ సిబ్బంది పై దాడి చేయడమే కాకుండా అక్కడే ఉన్న వైద్య పరికరాలు మల్టిపెరా మానిటర్ , ఇన్ఫూషన్ పంప్ , పారా మానిటర్ , ఫ్యాన్ లను ధ్వంసం చేశాడు. చేతికి దొరికిన వస్తువుతో వీరంగం చేస్తూ వుండడంతో సెక్యూరిటీ సిబ్బంది అతి కష్టం మీద తాళ్ళతో బంధించి స్థంభానికి కట్టేశారు. రాఘవేంద్ర చేసిన వీరంగంతో ఆసుపత్రి కి దాదాపు ₹ 1.5 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్టు వైద్య అధికారి శ్రీనివాస నాయక్ తెలిపారు. ఈ ఘటన పై వైద్య అధికారుల పిర్యాదు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *