విద్యార్థుల కోసం సమయానికి బస్సులు నడపండి

కర్నూలు జిల్లా..
పల్లెల నుంచి ఆదోని పట్టణానికి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులకు సమయానికి బస్సులు నడపాలని కోరుతూ ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరోద్వాజ్ DSF విద్యార్థి సంఘం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSF జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్, నవీన్ మాట్లాడుతూ పల్లెల నుంచి ఆదోని పట్టణానికి చదువుకోడానికి వస్తున్నా విద్యార్థులకు సమయానికి బస్సు రావడం లేదని విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు సమయానికి బస్సు నడపాలని అధికారులను కోరారు. ఇప్పటికైనా అధికారులు విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సరైన సమయానికి బస్సులు నడిపేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే  పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

సబ్ కలెక్టర్ తో మాట్లాడుతున్న డి ఎస్ ఎస్ విద్యార్థి సంఘం నాయకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top