ఓవర్ బ్రిడ్జి పైనుండి దూకి ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని కల్లుబావి వీధికి చెందిన రంగస్వామి అనే మతిస్థిమితం లేని వ్యక్తి సోమవారం పాత ఓవర్ బ్రిడ్జి పైనుంచి ఎగిరి ఆత్మీయతయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు బంధువులు వన్ టౌన్ పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా రంగస్వామికి మతిస్థిమితం లేదని, ఆయన భవన నిర్మాణం కార్మికుడని తెలిపారు. ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్లాడని బ్రిడ్జిపై నుంచి ఎగిరి కిందికి పడ్డాడని తెలిపారు. వెంటనే స్థానికులు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు రిఫర్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆత్మహత్యయత్నంకు పాల్పడిన రంగస్వామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version