కర్నూలు జిల్లా ఆదోని పాత ఓవర్ బ్రిడ్జి పై నుండి కింద పడి శాంతమ్మ (70) అనే వృద్ధురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. వృద్ధురాలి కుమారుడు మహానంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి కల్లుబాయిలో నివాసం ఉంటున్నామని వారం రోజుల క్రితం మహానంది తల్లి శాంతమ్మ (70) ఆస్పరి లో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లి ఈరోజు మధ్యాహ్నం తిరుగు ప్రయాణమై బ్రిడ్జిపై నుంచి నడుచుకుంటూ వస్తూ కళ్ళు తిరగడంతో కింద పడిందని మహానంది తెలిపారు. స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలు ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారని మహానంది మీడియాకు తెలిపారు.