కర్నూలు జిల్లా ఆదోని మాసా మసీద్ కాలనీకి చెందిన సయ్యద్ నూర్ (55) కొత్త ఓవర్ బ్రిడ్జి పై నుండి ప్రమాద వశాత్తు కింద పడటంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గుర్తించి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది క్షతగాత్రుడు అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ప్రాంగణంలో రోదనలు మిన్నంటకున్నాయి, వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. తోపుడు బండి పై కూరగాయల వ్యాపారం చేస్తాడని బంధువులు తెలిపారు.



