Connect with us

News

ఒక్కసారే అవకాశం.. ఇది వరకులా ఎక్కువ ఛాన్స్‌లు ఉండవ్‌.. సీఎం చంద్రబాబు

Published

on

ఏ అధికారి ఎక్కడ సరిపోతారో వారినే అక్కడ నియమించామని భావిస్తున్నాను. అందుకోసం చాలా కసరత్తు చేశాం. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను.
బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తా… లేకపోతే కొత్తవారిని చూసుకుంటా
కేంద్రం నుంచి వీలైనంతగా నిధులు తేవడంపై దృష్టి పెట్టండి
అధికారులకు సీఎం స్పష్టీకరణ
బుధవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. పాల్గొన్న మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, లోకేశ్, కొల్లు రవీంద్ర..
అమరావతి: ఏ అధికారి ఎక్కడ సరిపోతారో వారినే అక్కడ నియమించామని భావిస్తున్నాను. అందుకోసం చాలా కసరత్తు చేశాం. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. మీరు నన్ను నమ్మండి. కలిసి ముందుకెళదాం. అంచనాల్ని అందుకునేలా అందరూ పనిచేయాలి.
గతంలో కొందరు అధికారుల పనితీరు అంత బాగా లేకపోయినా, ఫలితాలు కనిపించకపోయినా చూసీచూడనట్లు ఉండేవాడిని. మరిన్ని అవకాశాలు ఇచ్చేవాడిని. ఇకపై అలా ఉండదు. అధికారుల పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షిస్తాను.
ఒకసారే అవకాశమిస్తాను. దాన్ని అందిపుచ్చుకుని బాగా పనిచేసినవారిని మరింతగా ప్రోత్సహిస్తాను. పని చేయనివారికి థ్యాంక్స్‌ చెప్పేసి కొత్తవారిని చూసుకుంటాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టంచేశారు.

బుధవారం సాయంత్రం ఆయన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో సమావేశమయ్యారు. చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. అధికారులతో ఇంత విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి.
వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న తీరు, ప్రాధాన్యతలను ఆయన స్పష్టంగా తెలియజేశారు. అధికారుల నుంచి ఎలాంటి పనితీరు ఆశిస్తున్నదీ విస్పష్టంగా చెప్పారు.
పనులు చేయడానికి డబ్బుల్లేవని చెప్పొద్దని, నిధులులేకుండానే చేసే పనులు చాలా ఉంటాయని, వాటిపై దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు.
కేంద్రం నుంచి వీలైనన్ని మార్గాల్లో నిధులు తెచ్చుకోవాలి
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల్లో రాష్ట్రానికి ఏ మేరకు తెచ్చుకోగలమన్నదానిపై ఆయా విభాగాల అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని చంద్రబాబు తెలిపారు. *వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌), ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ) చేపట్టే ప్రాజెక్టులు… ఇలా కేంద్రం నుంచి ఎలా వీలైతే అలా నిధులు రాబట్టుకోవడమే ప్రధాన లక్ష్యం కావాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు, మూడు నెలల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ ఆ కోణంలోనే ఉండాలన్నారు.
కేంద్రం నుంచి శాఖల వారీగా రాష్ట్రానికి అవసరమైన సాయం తెచ్చుకునేందుకు ఇప్పటికే ఎంపీలు, మంత్రులతో బృందాన్ని ఏర్పాటు చేశామని.. రాష్ట్రస్థాయిలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులు ఒక బృందంగా పనిచేస్తూ, ఎంపీలతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు.
అధికారులు మానవీయ కోణంలో పనిచేయాలి.
అధికారులు అన్ని సార్లూ రూల్స్‌ పట్టుకుని వేళ్లాడటం సరికాదని, కొన్ని సందర్భాల్లో ప్రజలకు మేలు చేసేందుకు మానవీయ కోణంలో ఆలోచించాలని చంద్రబాబు సూచించారు.

ఓట్లు వేరు. ప్రజలకు మంచి చేయడం వేరు. ప్రతి పనికీ రాజకీయ ప్రయోజనం ఉండకపోవచ్చు.

కానీ మంచి చేశామనే తృప్తి ఉంటుంది. నన్ను అక్రమంగా అరెస్ట్‌ చేసినప్పుడు అంత మంది రోడ్డెక్కడానికి కారణం… అంతకు ముందు నేను చేసిన మంచే. మంచి చేస్తే ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. ప్రజలు సాయం కోరి వస్తే.. దాన్ని ఎలాగైనా పరిష్కరించేలా అధికారుల ఆలోచనలు ఉండాలి.

బ్యూరోక్రటిక్‌ కోణంలో కాకుండా మానవీయ కోణంలో పనిచేయాలి’ అని స్పష్టం చేశారు.
పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యం

రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ), పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజా భాగస్వామ్యం (పీ4) విధానాల్ని అనుసరిస్తామని చంద్రబాబు తెలిపారు.

1995లో ఇంజినీరింగ్‌ కాలేజీల్ని నెలకొల్పాలి ఆనుకున్నప్పుడు ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే… ప్రైవేటు రంగంలో ప్రోత్సహించామని గుర్తు చేశారు. అప్పట్లో ఆ చొరవ తీసుకోబట్టే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం నలుమూలలా వేల సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ నిపుణులు ఉన్నారని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న 1-2 శాతం మంది, అట్టడుగున ఉన్న 10 శాతం మందికి చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, పీ4 విధానంలో దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, రౌడీలను అణచివేస్తామని, గంజాయి ఆనవాళ్లే లేకుండా చేస్తామని తెలిపారు. ఈ విషయంలో అధికారులు సమర్థంగా పనిచేయాలని కోరారు.

నేను పరిగెడితే చాలదు… మీరూ పరిగెత్తాలి..!

రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అధికారులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని చంద్రబాబు సూచించారు. సమస్యల్ని తీసుకుని పరిష్కారం కోసం తన వద్దకు రావడం సరికాదని, పరిష్కారం కూడా వారే ఆలోచించుకుని రావాలన్నారు. ఇది వరకు తాను మాత్రమే పరిగెత్తేవాడినని, ఇప్పుడు మంత్రులు, అధికారులు కూడా పరుగు పెట్టాలని ఆయన స్పష్టంచేశారు. మళ్లీ 1995నాటి చంద్రబాబును అప్పటి పాలనను చూస్తారని ఆయన తెలిపారు. అప్పట్లో తనతో పనిచేసినవారెవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించగా… ముగ్గురు, నలుగురు చేతులెత్తారు. ‘ఏ కార్యక్రమానికైనా నిధుల్ని ఎలా సమకూర్చుకోవాలన్న ప్రణాళికతో రండి. నా దగ్గరకు వచ్చాక దానిపై చర్చిస్తూ సమయం వృథా చేయొద్దు’ అని ఆయన పేర్కొన్నారు. ఇకపై తనతో సమావేశాలు కూడా గంట వ్యవధికి మించవని, నిర్ణయాత్మకంగా ఉంటాయని స్పష్టంచేశారు.

చెల్లించాల్సిన బకాయిలు, బిల్లులు రూ.లక్ష కోట్లు!

వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన విధ్వంసం వల్ల రాష్ట్ర విభజననాటికంటే దారుణమైన పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. చెల్లించాల్సిన బిల్లులు, బకాయిలు రూ.లక్ష కోట్ల వరకు ఉన్నాయన్నారు. కేంద్రం ఆక్సిజన్‌ అందిస్తే తప్ప ముందుకెళ్లలేని పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు. ‘రాష్ట్రానికి సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చింది. పోలవరం, అమరావతితోపాటు, వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తామని చెప్పింది. ఇది మంచి పరిణామం. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్‌కు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది’ అని పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడం వల్ల అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోలేకపోయాం. నేను కేంద్ర మంత్రుల వద్దకు వెళితే.. గత ప్రభుత్వం కనీసం యుటిలిటీ సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేదని, నిధులు దారి మళ్లించిందని చెప్పారు’ అని తెలిపారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు  ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Continue Reading

News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మృతదేహాన్ని తరలిస్తున్న ఫోటో
Continue Reading

News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

Published

on

ఎమ్మిగనూరు, మే 13:

లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..

ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. సోమన్న, ఏసీబీ డీఎస్పీ

Continue Reading
News2 weeks ago

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

News2 weeks ago

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

News4 weeks ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News2 months ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News2 months ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News2 months ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News3 months ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

News3 months ago

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

Trending