Connect with us

News

ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. శుక్రవారం శ్వేతపత్రం విడుదల

Published

on

అమరావతి : ఆర్థికశాఖపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ – శ్వేతపత్రం విడుదల..
ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని సీఎం చంద్రబాబు..
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం, అప్పులు వంటి వివరాలను ప్రజల ముందుంచేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు..
శుక్రవారం శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఆర్థికశాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా పరిశీలన చేసిన కూటమి ప్రభుత్వం 2019-24 మధ్య లక్షా 41 వేల 588 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు వేల కోట్లు ఉన్నట్లు తేల్చింది. 93 వేల కోట్లు సీఎఫ్ ఎమ్ ఎస్ లోకి అప్ లోడ్ చేయలేదన్న ప్రభుత్వం, 48 కోట్ల మేర బిల్లులు అప్ లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదని నిర్ధారించింది.

నీటిపారుదల శాఖ, పోలవరం బిల్లులు భారీగా పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ ప్రాజెక్టులకు చెందిన 19 వేల 324 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు, ఆర్థిక శాఖ నుంచి 19 వేల 549 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు వెల్లడించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 14 వేల కోట్లకు పైగా బకాయిలు, మున్సిపల్ శాఖలో 7 వేల 700 కోట్ల బకాయిలు కలిపి మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రేపు శాసనసభలో ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

కాగా రాష్ట్రంలో అన్ని శాఖలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు అంశాలపై ఆయన శ్వేతపత్రాలను విడుదల చేశారు. పోలవరం, అమరావతి, విద్యుత్ రంగం, ఇసుక దోపిడీ వంటి అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేసిన చంద్రబాబు వాటి వివరాలను ప్రజల ముందుంచారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై బుధవారం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గురువారం మధ్యాహ్నం శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి గత ప్రభుత్వంలో భద్రతా వైఫల్యాలను ఎండగట్టనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆర్థిక సంక్షోభాన్ని, రాష్ట్ర వాస్తవ ఆర్థికచిత్రాన్ని ప్రజల ముందు పెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు  ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Continue Reading

News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మృతదేహాన్ని తరలిస్తున్న ఫోటో
Continue Reading

News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

Published

on

ఎమ్మిగనూరు, మే 13:

లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..

ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. సోమన్న, ఏసీబీ డీఎస్పీ

Continue Reading
News2 weeks ago

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

News2 weeks ago

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

News4 weeks ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News2 months ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News2 months ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News2 months ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News3 months ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

News3 months ago

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

Trending