News
రైతుల ప్రాణాలు తీస్తున్న వడ్డీ వ్యాపారస్తులు
◆ రైతుల ప్రాణాలు తీస్తున్న వడ్డీ జలగలు
◆ అధిక వడ్డీలకు అప్పులు, కట్టలేకపోతే వేధింపులు..
◆ ఊళ్లు వదిలి వెళ్తున్న పలువురు బాధితులు..
◆ ఆత్మహత్యలూ చేసుకుంటున్న దుస్థితి..
◆ ఇళ్లు, ఆస్తులు రాయించుకుంటున్న వైనం..

వడ్డీ జలగల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పట్టణస్థాయి నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు వడ్డీ దందా కొనసాగుతోంది. వడ్డీ వ్యాపారుల చేతుల్లో చిక్కి రైతులు, చిరు వ్యాపారులు, తోపుడుబండి, చాట్, చికెన, చిల్లర దుకాణాలు, ప్రైవేటు, ప్రభుత్వ చిరుద్యోగు ఊళ్లు వదులుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని, వడ్డీలపై వడ్డీలు వసూళ్లకు పాల్పడుతున్నారు, ఇక ఆటోలపై ఫైనాన్స్ కావాలంటే డాకుమెంట్ చార్జెస్ అని ఆలస్యం అయితే ఫైన్ అని వసూలు చేస్తూ వడ్డీ వ్యాపారులు దోపిడీ చేస్తున్నారు. వడ్డీలు కట్టలేక ప్రాణాలు వదులుతున్నారు.

కర్నూలు జిల్లా మద్దికేర మండలం అగ్రహారం గ్రామానికి చెందిన విజయ్ అనే 32 సంవత్సరాల యువరైతు అప్పుల బాధ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంలో నష్టం వచ్చి 20 రోజుల క్రితం భార్యా ఇద్దరు ఆడపిల్లలతో ఊరు వదిలి ఆదోనికి చేరుకొని ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయినా వడ్డీ జలగల వేధింపులకు తట్టుకోలేక ఇటు సంసారం నడుపుకోలేక జీవితంపై విరక్తి చెంది ఆదోని – ఇస్వి అప్ రైల్వే లైన్ KM NO: 499/15 వద్ద ట్రైన్ NO 12163 కింద పడి రైతు విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
రైల్వే ఎస్ఐ రామస్వామి ఇచ్చిన వివరాల మేరకు మద్దికేర మండలం అగ్రహారం గ్రామానికి చెందిన జి. పకీరప్ప కుమారుడు విజయ్ (32) అప్పుల బాధ తట్టుకోలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రామస్వామి తెలిపారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
