నంద్యాలజిల్లా: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు 1లక్ష 83వేల 686 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉందని తెలిపారు. శ్రీశైలం డ్యాం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం : 846 అడుగులు ఎత్తుకు నీళ్లు చేరాయి. డ్యామ్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు ప్రస్తుతం : 72.0497 టీఎంసీలు నీరు నిలువ ఉన్నట్లు అధికారి తెలిపారు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.
శ్రీశైలం డ్యామ్ నీటి నిల్వలు..
ఇన్ ఫ్లో : 1,83,686 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 846.00అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
ప్రస్తుతం : 72.0497టీఎంసీలు