కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఇందిరా నగర్, బండేమెట్ట వార్డు ప్రజలకు 135 ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో 2100 రూపాయలు కట్టి ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కల నెరవేరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చలపతి కౌన్సిలర్ చిన్న మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిమ్మప్ప పాల్గొన్నారు.



