విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి

ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం ఆర్ఆర్ లేబర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగ్, షూస్, యూనిఫామ్, అందజేసే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, జనసేన పార్టీ ఇంచార్జ్ మల్లప్ప, పాల్గొన్నారు. విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బ్యాగులను పుస్తకాలు, యూనిఫామ్ లు పంపిణీ చేశారు. అనంతరం పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షీల్డ్ బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నత చదువులు చదువుకొని లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి
పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి
యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version