కర్నూలు జిల్లా ఆదోనిలో తాళాలు వేసిన ఇండ్లను దొంగలు టార్గెట్ చేశారు. తిరుమల నగర్ మరియు బాబాగార్డెన్ సమీపంలో నాలుగు ఇండ్లలో చోరీకి పాలుపడ్డారు దొంగలు. రామమూర్తి అనే వ్యక్తి ఇంట్లో 2 వేలు నగదు, 30 గ్రాముల బంగారు, 10 గ్రాముల వెండి దొంగతనం అయినట్లు ఇంట్లో వాళ్లు తెలిపారు. మిగిలిన మూడు ఇండ్లలో ఓనర్లు ఊర్లో లేనందున ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.