కర్నూలు జిల్లా ఆదోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాటా ఐపిఎల్ 2024 బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని అరెస్ట్ చెసి వారి వద్ద నుండి సుమారు 2 లక్షల 50 వేలు నగదు 4 సెల్ ఫోన్ స్వాధీనం తీసుకున్నారు 3 టౌన్ పోలీసులు. ముద్దాయిలను డి.ఎస్.పి శివ నారాయణ స్వామి ముందు హాజరు పరిచి రిమాండ్ కి తరలించారు త్రీ టౌన్ సిఐ నరసింహారాజు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు సెల్ ఫోన్లు

పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా SP కృష్ణకాంత్ IPS ఆదేశాల మేరకు, ఆదోని డిఎస్పి శివనారాయణ స్వామి స్వీయ పర్యవేక్షణలో ప్రత్యేక బృందంగా ఏర్పడి TATA IPL – 2024 క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై దాడులు చేపట్టినారు. దాడులలో ముద్దాయిలు ఎమ్మిగనూరు బై పాస్ వద్ద కల్వారీ కొండ దగ్గర ముల్లా కంపల చెట్ల క్రింద క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూన్న 1) ఆదోని మరాటిగేరికి చెందిన బోయ మహానంది, వయసు 49 సం. తండ్రి పేరు late బోయ రామన్న, 2) మరాట్ వాడికి చెందిన బోయ రమేశ్, వయస్సు 23 సంలు, తండ్రి పేరు బోయ మహానంది, 3) ఎమ్మిగనూరు మరెమ్మ గుడి సమీపంలో ఉంటున్న S. షహీద్, వయసు.40 సం.లు. తండ్రి పేరు జిలానీ, 4) కార్వాన్ పేటకు చెందిన బెస్త వినోద్, వయసు. 35 సం.లు S/O ఈరన్న, లను అరెస్టు చేసి వారి వద్ద నుండి 2 లక్షల 50 వేలు నాలుగు సెల్ ఫోన్లును స్వాధీనం చేసుకొని ఆదోని 3 టౌన్ పోలీసు స్టేషన్ లో Cr.No.41/2024u/s 7(a) r/w 8(e) APP Act and Sec 9(1) APG (Cricket Betting) Act కేసు నమోదు చేసి ముద్దాయిలను రిమాండుకు తరలించారు.

సిఐ నరసింహ రాజు మాట్లాడిన వీడియో


వారు 22.04.2024 వ తేదీ న జరుగుచున్న ముంబై ఇండియన్స్ Vs రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భముగా క్రికెట్ బెట్టింగ్ అడే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తునారు. అందుకు వారిపైన ఆదోని 1 టౌన్ పోలీస్ స్టేషన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో
కేసులు ఉన్నవి. క్రికెట్ బెట్టింగ్ ద్వారా అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకొని, మరాటిగేరునకు చెందిన గొల్ల భీమా, పెద్ద మసీదు ఏరియాకు చెందిన ఇస్మాయిల్, రాజరాజేశ్వరి నగర్ కు చెందిన పింజరి మహమ్మద్ ఖాసీం, కార్వాన్ పేట కు చెందిన వినోద్, LB స్ట్రీట్ కు చెందిన మూర్తి మరియు ఎమ్మిగనూరుకు చెందిన షాహీద్ లు క్రికెట్ బెట్టింగ్ ఆడే వారి నుంచి డబ్బులు వసూళ్లు చేసి ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. మొత్తం వసూలు చేసిన డబ్బులను నెల్లూరు జిల్లా కావలి కి చెందిన ఖాజా కు పంపించేవారని అందుకు వారికి రూ. 1000/- లకు రూ.2000/- లు కమిషన్ ఇస్తూ క్రికెట్ మ్యాచ్ కు టీమ్ లను బట్టి రూ 1000/- 1200, 1500, 1800, 2000 ల చొప్పున గెల్చిన వారికి
ఇచ్చేవారని సెల్ ఫోన్ లో క్రికెట్ బెట్టింగ్ ను నడుపుతున్నట్లు సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఆదోని త్రీ టౌన్ CI P. నరసింహ రాజు తన సిబ్బంది H.C లక్ష్మణ స్వామి, P.C. నరేంద్ర, P.C.బి. పరశురాం, PC పరమేష్, PC D. గిరిబాబు, P.C. నరసింహులు, HG 134 ఇస్మాయిల్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *