కర్ణాటక: తుంగభద్ర: తుంగభద్ర డ్యామ్ అధికారులు తెలిపిన సమాచారం మేరకు
ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా తుంగభద్ర డ్యామ్ కు వరద నీరు భారీగా వస్తుండడంతో ఏ క్షణమైనా తుంగభద్ర డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. పైనుంచి వస్తున్న వరద నీరుతో తుంగభద్ర రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లోలు పెరిగే అవకాశం ఉన్నందున మిగులు నీరు ఏ క్షణంలోనైనా నదిలోకి వదిలే అవకాశం ఉంది. తుంగభద్ర నది కి ఆనుకుని ఉన్న దిగువ గ్రామాలలోని సంబంధిత అధికారులు మరియు ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని మరియు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇన్ ఫ్లో ప్రస్తుతం 116040 క్యూసెక్కులు ఉంది
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ఉండగా ప్రస్తుతం నీటిమట్టం 1621.32 అడుగులకు చేయింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 65.110 టీఎంసీలకు చేరడంతో ఏ క్షణమైనా దిగువకు నీరు వదిలే అవకాశం ఉన్నందు దిగువ గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యామ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.