News
మట్కా, నాటు సారా స్థావరాలపై పోలీసుల దాడులు
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పరిధిలోని రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్న నాటు సారా స్థావరాలపై సీఐ శ్రీ రామ్ వారి సిబ్బంది దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ద్వంశం చేశారు. రెండు రోజుల వరుస దాడుల్లో
అక్రమంగా నాటు సారా అమ్ముతున్న 5 మందిని అరెస్టు చేసి వారి వారి వద్ద నుండి 110 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.
మట్కా బుక్కీలను 6 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 1లక్ష రూపాయలు స్వాధీనం చేసుకొని 11 మందిని రిమాండ్ కి తరలించారు..

వన్టౌన్ సిఐ శ్రీ రామ్ తెలిపిన వివరాలు యిలా ఉన్నాయి..
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO సోమన్న పర్యవేక్షణలో రెండు రోజులుగా రణమండల కొండల్లో, యల్లమ్మ కొండలో మరియు ఇస్వి కొండలలో తెల్లవారుజామున 05.00 గంటల నుండి దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటు సారా కాస్తున్న బట్టీలను ద్వంశం చేసి, సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను పారబోసి, డ్రమ్ములను ద్వంశం చేశామని తెలిపారు. మట్కా నిర్వహిస్తూ నాటు సారా అమ్ముతున్న 11 మంది వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారి నుండి 11 వైట్ కలర్ ప్లాస్టిక్ క్యాన్ లలో 110 లీటర్ల నాటు సారాను మరియు మట్కా డబ్బులు Rs. 1,00,000/- లను స్వాదీనము చేసుకుని వారిపై కేసులు నమోదు చేసి రిమాండు కు తరలించామని తెలిపారు.

ముద్దాయిల వివరాలు :-
నాటు సారాలు పట్టుబడిన వారిపై Cr. No. 140/2023 u/s 7(A) r/w 8(E) APP Act కింద
A1గా నిజాముద్దీన్ కాలనీకి చెందిన బోయ అంజిని, వయస్సు: 40 సంవత్సము,
A2గా వాల్మీకి నగర్ కు చెందిన బోయ మురళి, వయస్సు: 33 సంవత్సరాలు,
A3గా వాల్మీకి నగర్ కు చెందిన బోయ లాల్, వయస్సు: 40 సంవత్సరాలు,
A4గా శుక్రవారిపేటకు చెందిన బోయ హరి కృష్ణ, వయస్సు: 34 సంవత్సరాలు,
A5గా బోయగేరికి చెందిన బోయ నాగి రెడ్డి, వయస్సు: 34 సంవత్సరాలు,

మట్కాలో పట్టుబడిన వారిపై Cr. No. 140/2023 u/s 7(A) r/w 8(E) APP Act Sec 9(1) APG Act Matka కింద
A1గా మట్కరిగేరికి చెందిన భార్పెట్ మహమ్మద్ గౌస్, వయస్సు: 76 సంవత్సరాలు,
A2గా విక్టోరియా పేటకు చెందిన గొల్ల కన్న, వయస్సు: 41 సంవత్సరాలు,
A3గా నిజాముద్దీన్ కాలనీకి చెందిన సయ్యద్ ఖాజా, వయస్సు: 36 సంవత్సరాలు,
A4గా అమరావతి నగర్కు చెందిన షేక్ ఖాదర్ బాషా, వయస్సు: 59 సంవత్సరాలు,
A5గా బొబ్బులమ్మ దేవాలయం ప్రాంతనికి చెందిన గొల్ల శ్రీనివాసులు, వయస్సు: 54 సంవత్సరాలు,
A6గా మట్కరిగేరికి చెందిన ఈడిగ నరసింహులు గౌడ్, వయస్సు: 71 సంవత్సరాలు,
ముద్దాయిలను రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
