కర్నూలు జిల్లా ఆదోని పట్టణం డంప్ యార్డ్ సమీపంలో అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 18 కర్ణాటక మద్యం బాక్సులు ఒక స్కూటర్ను సెబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెబ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఉదయం ఆదోని పట్టణానికి చెందిన బోయ సూర్య, బోయ నీలకంఠ, దుబ్బ నరసింహులు ఒక మోటారు సైకిలు మీద 18 కర్ణాటక మద్యం బాక్సులు రవాణా చేస్తుండగా గుర్తించి అందులో ఇద్దరినీ అరెస్టు చేయగా నరసింహులు పారిపాయినట్లు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు 18 మద్యం బాటిల్లు ఒక స్కూటర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాడులలో ఎస్ఐలు మధు సూడాన్ రెడ్డి, శివలు , పిసిలు శ్రీనివాసులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



