కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో అతిసార విజృంబిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి గ్రామంలో పర్యటించారు. ముందుగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాగునీటి బోర్లను పరిశీలించారు. పాఠశాల ను సందర్శించి చిన్నారులకు ఏమైనా అతిసార లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. అతిసార వ్యాధి నివారణకు జిల్లా ఇన్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ శివ నారయణ శర్మ, మండల స్థాయి అధికారులు వేగవంతం గా స్పందించి కేసులను తగ్గించే విషయంలో బాగా పని చేశారని కొనియాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని గ్రామస్థులకు ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సూచించారు. త్వరలోనే గ్రామంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.