News
కార్మికుల జీవితాల్లో సరి కొత్త వెలుగులు..
■ కార్మికుల జీవితాల్లో సరి కొత్త వెలుగులు నింపిన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి.
■ 20 సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న కార్మికులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే..
కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం లో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన కొతారి మిల్ మూతపడడంతో కార్మికులు తమకు రావాల్సిన బకాయిలను ఇవ్వాలని 20 సంవత్సరాల క్రితం 2003లో కోర్టు మెట్లు ఎక్కారు. ఎమ్మెల్యే చొరవ చేసుకొని కార్మిక సంఘాల నాయకులతో ఫ్యాక్టరీ యజమానులతో చర్చలు జరిపి కార్మికులకు రావాల్సిన బకాల కంటే అధికంగా వచ్చేలా కార్మికులకు న్యాయం చేశారు. 772 మంది కార్మికులకు కోతారీ మిల్లు నుండి దాదాపు 9 కోట్ల రూపాయలు ప్రతి కార్మికుడికి సుమారు1,16,580/౼ రూపాయల చెప్పును ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. మొదటి చెక్కు కౌడేల్ పేటకు చెందిన వలీ భాష అనారోగ్యంతో ఉన్నారని తెలిసి వారింటికి వెళ్లి చెక్కులు అందజేశారు. అనంతరం మిగిలిన కార్మికులకు ఎమ్మెల్యే తన ఇంటి వద్ద చెక్కులను అందజేశారు. కార్మికుడు చనిపోయిన ఎడల వారి కుటుంబాలకు అందజేస్తామని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. కార్మికులకు న్యాయం జరిగేలా 20 సంవత్సరాల వరకు పోరాటం చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ కార్మిక సంఘాలకు కార్మిక సంఘా నాయకులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదారిమి యజమాని ప్రణీత పార్ట్నర్ వీర రాఘవ రెడ్డి, అడ్వకేట్ జీవన్ సింగ్ వైసిపి పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, కార్మిక సంఘ నాయకులు అజయ్ బాబు మరియు కార్మిక సంఘం నాయకులు..
News
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక
ఆదోని, ఏప్రిల్ 13:
పట్టణంలో అక్రమంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ యువత జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ హెచ్చరించారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బెట్టింగ్ నిర్వాహకులను స్టేషన్‌కు పిలిపించి ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసుల ఆదేశాలను అతిక్రమించి ఎవరైనా క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే వారిపై పీడీ (PD) చట్టాన్ని ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, బెట్టింగ్ ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తామని మరియు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని (Freeze) తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ముఖ్య అంశాలు:
- కఠిన చర్యలు: బెట్టింగ్ నిర్వాహకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తాం.
- నిఘా: బెట్టింగ్ రాయుళ్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది.
- ప్రజలకు విన్నపం: అక్రమ కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సంబంధిత వ్యక్తులు పాల్గొన్నారు.
News
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు
ఆదోని, ఏప్రిల్ 03:
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బాలాజీ విద్యానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది. తరగతి గది పైకప్పు పెచ్చులు ఊడి పడటంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘటన వివరాలు:
శుక్రవారం పాఠశాలలో తరగతులు జరుగుతుండగా ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో మూడవ తరగతి చదువుతున్న చరణ్, అరవింద్ అనే విద్యార్థులకు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం కావడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సెలవు రోజూ పాఠశాల నిర్వహణ:
ఈ ఘటనపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పాఠశాలను నడుపుతున్నట్లు తెలిసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

యాజమాన్యం వివరణ:
ఈ ఘటనపై పాఠశాల సంగీత టీచర్ మాట్లాడుతూ.. సిలబస్ పూర్తి కాలేదన్న కారణంతోనే సెలవు రోజున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. భవనం పైభాగంలో కోతులు బలంగా దూకడం వల్లే పెచ్చులు ఊడి పడ్డాయని ఆమె పేర్కొన్నారు. పాఠశాల నడుస్తున్న కారణంగా రిపేర్లు చేయించలేకపోయామని, వేసవి సెలవుల్లో పనులు చేయించాలని అనుకున్నామని వివరణ ఇచ్చారు.
తల్లిదండ్రుల ఆందోళన:
శిథిలావస్థకు చేరిన భవనాల్లో క్లాసులు నిర్వహించి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి సెలవు రోజున స్కూల్ నడుపుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

News
ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామం లో గత నెల 18వ తేదీ తండ్రి ఆస్తి పంచడం లేదని కత్తి తో దాడి చేసి అడ్డొచ్చిన తల్లిని కొట్టి తండ్రి సెల్ తో ఫోన్ పే ద్వారా 2 లక్షలు తన అకౌంట్ లో వేసుకొని తండ్రి బుల్లెట్ వాహనం తో పరారైన వేణుగోపాలను ఇస్వి పోలీసులు చాగి బస్టాండ్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక లక్ష 92 వేల నగదు, బుల్లెట్ మోటార్ సైకిల్, బంగారు గొలుసు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమైండ్ కి తరలించారు.


