నాటు సారా తయారీ బట్టీల ద్వంశం ముద్దాయిలు అరెస్టు

కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యెల్లమ్మ కొండలలో నాటు సారాయి తయారు చేస్తున్న నలుగురు ముద్దాయిలను A-1. బోయ సురేష్  (35), A-2. సంగ్రామ్ హబీబ్ బాష (45), A-3. బోయ అనిత (32), A-4. బోయ వెంకటేష్ వన్ టౌన్ సిఐ శ్రీరామ్ అరెస్టు చేసి వారి వద్ద నుండి 30 లీటర్ల నాటుసారాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1000 లీటర్ల బెల్లం ఊట ద్వంశం చేసినట్టు వన్ టౌన్ సిఐ తెలిపారు.

బెల్లం ఊటను పారబోస్తున్న ఫోటో

వన్ టౌన్ సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO  సోమన్న వారి పర్యవేక్షణలో ఆదోని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు శ్రీరామ్ వారి సిబ్బంది 16వ తేదీ గురువారం యెల్లమ్మ కొండలలో అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఒక మహిళను అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారు అయినట్లు తెలిపారు. వారి వద్ద నుండి 30 లీటర్ల నాటు సారాయి  ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  ఐదు ప్లాస్టిక్ డ్రమ్ములలో సుమారు 1000 లీటర్ల బెల్లం ఊటను పారబోసి డ్రమ్ములను మరియు బట్టీలను ద్వంశం చేసి కేసు నమోదు చేశామన్నారు. వారిని కోర్టుకు హాజరుపరచి రిమాండ్ కి తరలిస్తున్నట్లు సిఐ శ్రీరామ్ తెలిపారు.

బెల్లం ఊటను పారబోస్తున్న ఫోటో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Exit mobile version