News
క్షమించు గణనాథా
◆ కాలువలో తేలి ఉన్న గణనాథులు
◆ పట్టించుకోని గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు
◆ నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులు.
◆ చూడడానికి ఇబ్బందిగా ఉంటూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా కాలువలో తేలి ఉన్న గణనాథులు..
కర్నూలు జిల్లా ఆదోని లో గణనాథులకు భక్తిశ్రద్ధలతో ఐదు రోజులు పూజలు నిర్వహించి నిమర్జనం లో భాగంగా ఎల్ఎల్సీ కాలువలో వీటిని అర్ధరాత్రి ఎంతోమంది అధికారుల మధ్య నిమజ్జనం ఏర్పాటు చేశారు, ఆ రహదారి ఆదోని నుండి బాంబే హైవే కావడంతో ఎంతోమంది గణనాథ విగ్రహాలు ఇలా పడి ఉండడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద హరివాణం గ్రామానికి చెందిన గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు తయారీ వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని ప్రముఖులు, మేధావులు, చెబుతూనే ఉన్నారు. అయితే గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇలాంటి అవగాహన కల్పించకుండా పోవడం వల్ల భారీ వినాయకులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసి నిమజ్జనం చేయడం వల్ల ఇలా పర్యావరణానికి హాని కలుగుతుందని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కనిపిస్తూ ఉందని ప్రజలు, భక్తులు చెబుతున్నారు. ఒక అడుగు నుంచి మూడు అడుగుల మట్టి వినాయకులైతే నీళ్లలో నిమజ్జనం చేసిన వెంటనే కరిగిపోతాయని దీనిపై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. దీంతో నీరు కలిసితం కాకుండా, ఎవరికి గాని హాని ఉండదని తెలిపారు.. ప్లాస్టర్ పారిస్ విగ్రహాల వల్ల నీరు కలుషితమై తాగే పశువులకు, మనుషులకు, పంటలకు ఎంతో హాని కలిగి రోగాల బారిన పడే అవకాశం కూడా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముందుగానే చర్యలు తీసుకోవాలని కోరారు.




News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
