కర్నూలు జిల్లా అస్పరి (మం) తంగరడోన నల్లారెడ్డి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. బాణసంచా బాక్స్ పేలి సుమారు 25 మంది భక్తులకు గాయాలు అయ్యాయి. అందులో నలుగురికీ తీవ్ర గాయాలు అయ్యాయి. 20 మందిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఏరియా అసూపత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తంగరడోన నల్లారెడ్డి ఉత్సవాల్లో బాణసంచా పేలూస్తుండగా బాణసంచా బాక్స్ పై అగ్గి రవ్వలు ఎగిరి పడడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో 12 మంది పురుషులు ఐదు మంది మహిళలు ముగ్గురు చిన్నారులు ఆదోని ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.