ఆదోనిలో ట్రాఫిక్ సమస్య వలన రోడ్లపై వాహనదారులు, తోపుడు బండ్ల వ్యాపారుల మధ్య గొడవలు జరుగుతున్నా. రోడ్డుపై అడ్డంగా ఆపుకొని వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా వాదించి వారితో గొడవలకు దిగుతున్నారు.
ఆదోని మండలం సర్పంచ్ లక్ష్మన్న సోదరుడు నాగార్జున అనే వ్యక్తి తెలిపిన వివరాలు ఇలా వున్నాయి
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం రైతుబజార్ వద్ద పంపు మోటార్ రిపేరు కోసం కారులో వచ్చిన వ్యక్తి రోడ్డుపై అడ్డంగా ఆపిన సోడాబండి తీయాలని చెప్పి ఎన్ని సార్లు హార్న్ కొట్టినా పట్టించుకోకుండా వ్యాపారం సాగిస్తుండడంతో కారు దిగి సోడా బండి వ్యక్తి తో వాగ్వాదానికి దిగాడు. ఈ వాగ్వాదం కాస్త ముదిరి ఘర్షణగా మారి ఒకరి పై ఒకరు సోడా సీసాలతో కొట్టుకున్నారు. ఇద్దరికీ గాయాలు కావడంతో ఆదోని GGh కు తరలించారు.
ఈ ఘటనపై 2 వ పట్టణ పోలీసులు నాగార్జున , శ్రీనివాస్ ఇద్దరినీ విచారిస్తున్నారు.