ఆదోని వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఘన సన్మానం

2029లో జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం ◆ కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి ◆ రాష్ట్రంలో కొనసాగుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఘన విజయం సాధించిన జడ్పీటీసీ సభ్యుడు బోయ ఉరుకుందప్పతో పాటు, గెలుపొందిన ఎంపీటీసీలను ఆదోనిలో ఘనంగా సన్మానించారు.

పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
బోయ ఊరుకుందప్పను సన్మానిస్తున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డితో పాటు పట్టణ, మండల పార్టీ ముఖ్య నేతలు విజేతలకు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. అనంతరం సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆదోని నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి 16 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలు, 1 జడ్పీటీసీ, 10 ఎంపీటీసీ స్థానాల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చి పార్టీకి అండగా నిలిచారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తమను కల్పించినప్పుడు జరిగే ధన్యవాదాలు తెలుపుతున్న ఉరుకుందప్ప

వైఎస్సార్‌సీపీ హయాంలో ఆదోని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు మెడికల్ కాలేజ్, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు, విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మైనారిటీల కోసం ఉర్దూ కాలేజ్ తీసుకువచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తాము చేసిన అభివృద్ధిని గుర్తించిన ప్రజలు, రాబోయే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయడానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని పట్టణ, మండల వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జడ్పిటిసి ఉరుకుందపనులు సన్మానిస్తున్న నాయకులు