కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం పులికనుమా వద్ద ఆటోను బొలెరో వాహనం ఢీకొనడంతో వీరేష్ అనే 13 ఏళ్ళ బాలుడు అక్కడికక్కడే మృతి మృతిచెందగా అరుమందికి గాయాలు అయ్యాయి వెంటనే వారిని చికిత్స నిమితం ఆదోని జి. జి. హెచ్ కు తరలించారు. వీరంతా బసల దొడ్డి గ్రామానికి చెందిన వారీగా గుర్తించారు. క్షతగాత్రులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి బసవదొడ్డి గ్రామం నుంచి కూరగాయలు అమ్ముకోవడానికి ఆదోనికి వస్తుండగా అతివేగంతో బొలెరో వాహనం వచ్చి ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు.