విజయవాడ వరద బాధితులకు సహాయ అర్థం పట్టణంలోని ప్రధాన రహదారుల మీద జోలిపట్టి భిక్షాటన చేశారు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి..
కర్నూల్ జిల్లా ఆదోని లో స్థానిక బీమాస్ హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిరు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ విజయవాడలో వరదల్లో నష్టపోయిన అనేక కుటుంబాలు ధన , ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగిందని ఆవేదన వేక్తం చేశారు. నష్టపోయిన ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ తనవంతు సహాయం అందించాలని ఆదోని ప్రజలను కోరారు. ఈ శుభకార్యని మొదటగా ఎమ్మెల్యే తన నెల మొత్తం జీతన్ని ఇస్తునట్లు ప్రకటించారు. బీజేపీ నాయకులు, భీమాస్ హోటల్ చైర్మన్ విట్ట రమేష్ లక్ష రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం బీజేపీ నాయకులు మల్లికా 50 వేలు, చిన్నబసప్ప 25 వేలు ఇస్తామని తెలిపారు.సమావేశం అనంతరం ఆదోని పట్టణంలోని ప్రధాన రహదారిపై, పలు దుకాణాలలో బిక్షాటన చేస్తూ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళాలు సేకరించరు.