కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ బసరకొడు గ్రామ శాఖ మహాసభ, హుసేని అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించరు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.ఉచ్చిరప్ప మాట్లాడుతూ స్థానికంగా రోడ్లు సమస్యలు, అలాగే త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ సమస్యలను పరిష్కరించాలని, అలాగే గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఈ స్థానిక సమస్యలపై సిపిఎం పార్టీగా పోరాటాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. అనంతరం శాఖ కార్యదర్శిగా రామాంజనేయులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో మునిస్వామి పాల్గొన్నారు.