News
పేదల రక్తం తాగుతున్నా ప్రైవేట్ ఆస్పత్రులపై ఒక తల్లి ఆవేదన
◆ వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నా ప్రైవేటు ఆసుపత్రులు..
◆ సేవ పేరుతో వడ్డీ వ్యాపారులు వైద్య రంగంలో పెట్టుబడులు..
◆ కొత్త కొత్త పేర్లతో రోగులను పీల్చి పిప్పి..
◆ ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే ఆగమే..
◆ కాస్త క్రిటికల్ అని తెలియగానే హైదరాబాద్ కు రిఫర్..
◆ అక్కడి ఆసుపత్రులతో కమీషన్లు..
◆ నలుగురు డాక్టర్ల పేర్లు బోర్డులో రాసి, రండి రండి అని ప్రచారం..
◆ నిలువు దోపిడీకి అడ్డాలు.. తరతరాలకు తరగని ఆస్తులు..
కర్నూలు జిలా ఆదోని లో ప్రైవేటు ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుటుకొస్తునాయి. ప్రజలకు వైద్యం మరింత అందుబాటులోకి రావడం మంచి పరిణామమే… ఏ రంగంలో నైనా కాంపిటీషన్‌తో ధరలు తగ్గుతాయి. ఒక్క వైద్య రంగంలో మాత్రమే కొత్త ఆసుపత్రులు రావడంతో మరింత ధరలు పెరుగుతుంటాయి. వైద్య విధానంలో చికిత్సకు మాత్రం భలే డిమాండ్ పెరుగుతోంది. ఆదోని పెద్దఎత్తున ఆసుపత్రులు వెలుస్తున్నాయి. వైద్యం ముసుగులో వ్యాపారం మిలితమై వుంది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసేందుకు, కొంత కాలం పాటు శిక్షణా కాలం ముగిసిన తర్వాత పల్లెల్లో వైద్యం చేయమంటే మాత్రం ససేమిరా? అంటారు. కాని ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేయడానికి వైద్యులు ముందుంటారు. ప్రజల సొమ్ముతో చదివిన వాళ్లుకూడా పేదలకు వైద్యం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇక లక్షలు పెట్టి సీట్లుకొని చదువుకున్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మందులతో తక్కువ కాదు అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీలు చేస్తూ వుండేవారు. కాని కాలం మారింది. డాక్టర్ల తీరు కూడా మారింది. వైద్య విద్య పూర్తయిన వెంటనే ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అని నామకరణంతో ఆసుపత్రులు ఏర్పాటుచేస్తున్నారు. స్ధానిక నాయకులతోపాటు, జిల్లా స్దాయి నాయకులతో రిబ్బన్ కట్ చేయించారంటే చాలు పబ్లిసిటీ కూడా వస్తుంది. ఇక కార్పోరేట్ వైద్యం అంటూ మొదలుపెడుతున్నారు.
కొంత మంది డాక్టర్లు కలిసి సూపర్ స్పెషాలిటీ, మల్లీ సూపర్ స్పెషాలిటీ అంటూ అందమైన బోర్డులు ఏర్పాటు చేస్తారు. చౌరస్తాలలో పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిసిటీ కూడా బాగానే ఇస్తారు. ఇక ఓపి ఫీజులు కూడా తక్కువేం వుండవు. ఒక్కసారి డాక్టర్ చేతికి మన చేయి వెళ్లిందంటే చాలు, ఎన్ని రకాల వైద్య పరీక్షలు రాస్తారో అన్నది ఆ సమయానికి వారు వున్న మానసిక పరిస్దితి మీద కూడా ఆధారపడి వుంటుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయంటే అర్ధం చేసుకోవచ్చు. ఇంతా జరిగాక, ఇక్కడ అన్ని సదుపాయాలు లేవు. స్పెషలిస్టులు లేరు కర్నూలు, హైదరాబాద్‌కు రాస్తున్నామంటూ చేతులు దులుపుకుంటారు. తాంబూలాలిచ్చామని వదిలేస్తారు. ఇక వైద్యం వంతు హైదరాబాద్‌కు …. అక్కడ ఆసుపత్రిలో చేరగానే వైద్యం మొదలు కాదు. మళ్లీ టెస్టులు. ఒకరోజు ముందు రిఫర్ చేసిన ఆసుపత్రి టెస్టులైనా సరే. కర్నూలు, హైదారాబాద్ లో మళ్లీ చేయాల్సిందే… పంపిన ఆసుపత్రికి వాటాలు పంపాల్సిందే… ఇలా అందినకాడికి దోచుకోవడం మాత్రం ఆసుపత్రులకు బాగా అలవాటైపోయింది.
వైద్యం శూన్యం అన్నట్లు ఆదోని నుంచి నిత్యం ఆంబులెన్సులు కర్నూలు, హైదరాబాద్‌లోని పలు ఆసుపత్రులకు పోతూంటాయి. మరి ఆదోనిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులని ఏర్పాటు చేసిన వాటిలో అందరూ స్పెషలిస్టులే అంటారు. అన్ని రకాల వైద్య పరికరాలు, వైద్యులు అందుబాటులో అంటూ ప్రకటిస్తారు. ఎంతో నైపుణ్యం వున్న వైద్యులు అంటారు. కాని ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఒక రోజు వైద్యం చేయడం రెండో రోజు కర్నూలు, హైదరాబాద్ పంపేయడం ఇది బాగా అలవాటుగా మారింది. కొన్ని జబ్బులకు చికిత్సలో ముంచుకొచ్చేదాకా చూడడం, కర్నూలు, హైదరాబాద్‌కు పంపడం ఒక వ్యాపారంగా మారిపోయింది. అక్కడ లక్షల మాట తప్ప, వేల మాట అసలే మాట్లాడే పరిస్దితి వుండదు.
వైద్యం పేరుతో పేదల రక్తం తాగుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ ఆసుపత్రులు నరకానికి నకళ్లుగా మారాయంటున్నారు. ఇలా ఏర్పాటైన ఆసుపత్రుల్లో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. ప్రాణాలు కూడా పోతున్నాయి. కాని అవి వెలుగులోకి రావడంలేదు. అధికారులు పట్టించుకోవడంలేదు. కనీసం ఆ ఆసుపత్రులు ఎవరి పేరు మీద పర్మిషన్లు ఇస్తున్నారోకూడా తెలియడం లేదు. కాని ఆ ఆసుపత్రుల మీద చర్య తీసుకున్నవారు లేదు. కొత్త ఆసుపత్రులకు పర్మిషన్లు ఆగడం లేదు. ప్రజల జీవితాలతో ఆటలాడుకోకుండా వుండడం లేదు. వైద్యో నారాయణ హరిః కాస్త…హరీ! అనే దాకా వస్తున్నాయి. ప్రజల జీవితాలు చాలా చిన్నవైపోతున్నాయి.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
