గుడి ఆవరణంలో అక్రమంగా గుడిసె వేసుకొని భక్తులకు ఇబ్బంది కలిగిస్తు గుడికి భక్తులు రాకుండా చేస్తున్న వారిని అక్కడి నుంచి తొలగించాలని డీఎస్పీ సబ్ కలెక్టర్ ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేసిన గుడి పీఠాధిపతి..

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మెయిన్ రోడ్ సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న అనంత మంగళ ఆంజనేయ స్వామి దేవస్థానం దక్షిణ సింహద్వారం ముందు గుడి పరిసరాలలో శ్రీమతి బోయ పార్వతి అనే మహిళ అక్రమంగా గుడిసెను వేసుకొని గుడి మహాగోపురం ద్వారానికి అడ్డంగా కాలకృత్యాలు చేస్తూ దేవస్థానానికి వచ్చి భక్తులకు ఇబ్బందులకు గురిచేస్తుంది అని, ఈ మహిళ ప్రవర్తన వల్ల దేవస్థానం పవిత్ర వాతావరణం దెబ్బతింటుందని, దేవస్థానం అపవిత్ర కాకుండా కాపాడాలని అధికారులకు కోరుతూ విరాట్ హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు, జిల్లా అధ్యక్షులు అశోక్, నగర అధ్యక్షులు అడివేస్ మరియు శ్రీ అనంత మంగళాంజనేయస్వామి ప్రెసిడెంట్ వీరన్న గౌడ్, వీరేశ్, యువరాజ్, శ్రీకాంత్ డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ అధికారికి మరియు సబ్ కలెక్టర్ కు ఎమ్మార్వో కు రాతపూర్వకంగా వినతి పత్రం అందజేశారు.

డీఎస్పీ, సబ్ కలెక్టర్, ఎమ్మార్వో కి ఇచ్చిన అర్జీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *