News
ఆదోని ఫర్టిలైజర్స్ షాపులలో 32 లక్షల అక్రమ నిల్వలను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు
ఆదోని ఫర్టిలైజర్ షాపులపై వ్యవసాయ మరియు విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు..
శ్రీ భీమేశ్వర ఫర్టిలైజర్స్, భువనేశ్వరి సీడ్స్, గీత హైబ్రిడ్ సీడ్స్ దుకాణాలలో సుమారు 32 లక్షల విలువగల రసాయనకి ఎరువులు, బిటి పత్తి విత్తనాలు, కూరగాయల విత్తనాలు అమ్మకాలను నిలిపివేసిన అధికారులు..

వ్యవసాయ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా ఆదోనిలో ని విత్తనా మరియు ఎరువుల దుకాణాలపై వ్యవసాయ మరియు విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక దాడులు నిర్వహించిరు. ఈ దాడులలో
భీమేశ్వర ఫర్టిలైజర్స్ స్టాట్ బుక్ కు మరియు ఈపాస్ మిషన్ నందు పొందుపరిచిన నిల్వల లో తేడాలు ఉండడం వల్ల 5 లక్షల 88 వేల 520 రూపాయల విలువగల రసాయనిక ఎరువులను మరియు భువనేశ్వరి సీడ్స్ నందు 22 లక్షల 61 వేల 941 రూపాయల విలువగల రసాయనిక ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు.

అంతేకాక భువనేశ్వరి సీడ్స్ సెంటర్ నందు 2 లక్షల 46 వేల 240 రూపాయల విలువగల బిటి పత్తి విత్తనాలను మరియు గీత హైబ్రిడ్ సీడ్స్ లో ఒక లక్ష 7 వేల 700 రూపాయల కూరగాయ విత్తనాల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

అనంతరం నవత ట్రాన్స్పోర్ట్ మరియు SRMT ట్రాన్స్పోర్ట్ లలో కూడా తనిఖీలు నిర్వహించారు.
ఈ దాడుల్లో వి. హనుమంతరావు సహాయ వ్యవసాయ సంచాలకులు, క్రోసూరు మరియు పి చంద్రశేఖర్ రెడ్డి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి, సహాయ సంచాలకులు అరుణకుమారి పాల్గొన్నారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
