కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రధాన రహదారిపై బడ్జెట్ పేపర్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.లింగన్న మాట్లాడుతూ రైతులు, కూలీలు, కార్మికులకు వ్యతిరేకంగా ఉందని, ఉపాధి హామీ, ఆహార భద్రత, గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయింపులు లేవని, పేదలకు వ్యతిరేకమైన ఈ బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నామని  అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు మండల నాయకులు గోవిందు, హనుమంత రెడ్డి, కృష్ణ, హుస్సేని మరియు రైతులు కూలీలు  పాల్గొన్నారు.

పూర్తి వీడియో చూడాలంటే దీనిపై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *