News
కొత్త క్రిమినల్ చట్టాలను అమల్లోకి తెచ్చిన మోడీ సర్కార్
కోర్టు కోర్టుకి, తీర్పు తీర్పుకి వ్యత్యాసాలు ఉండడంతో వాయిదాల మీద వాయిదాలు పడుతున్న కేసులతో దొంగలు దొరలుగా – దొరలు దొంగలుగా చలామణి అవుతున్నారు. మనదేశంలో సామాన్యుడికి న్యాయం జరుగుతుందా అనే ఆలోచన సన్నగిల్లుతుంది. బతికుండగా తుది తీర్పు వస్తే చాలు అని ఎదురుచూసే పరిస్థితి సామాన్యులది. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన తర్వాత కోర్టులో తీర్పు కోసం రోజులు ఎదురు చూడకుండా సత్వరంగా తీర్పు రావాలని సామాన్యు ప్రజలు ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్..

టీవీ9 బర్నింగ్ టాపిక్ లో తెలిపిన వివరాలు..
భారతదేశంలో ఇప్పుడు వరకు ఉన్న పెండింగ్ కేసుల సంఖ్య 5 కోట్ల 10 లక్షలు ఇందులో 30 ఏళ్లకు పైగా ములుగుతున్న కేసులు 1 లక్ష 80 వేలు నేరస్తులుగా రుజువు కాక జైల్లోనే మగ్గుతున్న రిమైండ్ ఖైదీల సంఖ్య 4 లక్షలు 50 వేలు.. వీరి కోసం సపరేట్గా కొత్త జైలు నిర్మించాలి అనే పరిస్థితి..

అందుకే ఈ మార్పు తెస్తున్నామని మోడీ ప్రభుత్వం సగర్వంగా ప్రకటించుకుంది.
అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు..
150ఏళ్ల తర్వాత మారిన బ్రిటీష్ కాలం నుంచి అమల్లో ఉన్న చట్టాలు
- 1. ఇండియన్ పీనల్ కోడ్-IPC స్థానంలో భారతీయ న్యాయ సంహిత-BNS.
- 2. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-CRPC స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-BNSS.
- 3. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-IEA స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం-BSA చట్టాలు
భారతీయ న్యాయ సంహిత చట్టంలో రాజద్రోహం స్థానంలో దేశద్రోహం పదం.

- ఎవరైన అరెస్టయితే 14రోజుల్లోపు మాత్రమే కస్టడీ కోరే ఛాన్స్..
- 40రోజులల్లో తీర్పు, 60 రోజుల్లో అభియోగాలు నమోదు.. ఏడేళ్లకు పైగా శిక్ష పడే ఛాన్స్ ..
- ఫోరెన్సిక్ నిపుణులచే ఆధారాలు సేకరించాలి
3 నుంచి 7ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు
24 గంటల్లోనే FIR నమోదు చేయాలి.. - 14 రోజుల్లోనే ఈ కేసును కొలిక్కి తేవాలి.
అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి నమోదు చేయాలి.. - ఆ బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లోనే సిద్ధం చేయాలి..
- పిల్లలను కొనడం, అమ్మడాన్ని కూడా కొత్త చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం..
- మైనర్‌పై సామూహిక అత్యాచారం చేస్తే జీవిత ఖైదు లేదా మరణశిక్ష..
- చరాస్తులను, స్థిరాస్తులను పోలీసులు స్వాధీనం చేసుకునే అధికారం..
- మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తును 2 నెలల్లో పూర్తి చేయాలి..
- బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలి..
- మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచాలి..
- అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియోల ద్వారా కేసు..
- పోక్సో కేసుల్లో మాత్రం బాధితురాళ్ల వాంగ్మూలాలు పోలీసులే కాకుండా మహిళా ప్రభుత్వ అధికారి ఎవరైనా నమోదు చేయవచ్చు..
- క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం CCTNS..
- దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు అనుసంధానం..
- డిజి లాకర్‌ను ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం ICJSకు అనుసంధానం..
- ఆధారాలు ఎవరూ కూడా మాయం చేయలేని వ్యవస్థ రూపకల్పన..
- అనుమానాస్పద వస్తువులు జప్తు చేసినప్పుడు 48గంటల్లో కోర్టులో సమర్పించాలి..
- బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు..
- ఫిర్యాదుపై పోలీసులు 3రోజుల్లోగా ఫిర్యాదుదారుల సంతకాల సేకరణ..
- మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, దివ్యాంగులు,15 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం లేదు తాము ఉండే చోటే పోలీసుల సాయం..
- దర్యాప్తు, న్యాయవిచారణ సమన్లు SMS ద్వారా జారీ..
- గెజిటెడ్ అధికారి సమక్షంలో వీడియో ద్వారా సాక్ష్యం..
- బాధితులకు, నిందుతులకు ఎఫ్ఐఆర్ కాపీ ఫ్రీ
- పోలీస్ రిపోర్ట్, ఛార్జిషీట్, స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్ల 2వారాల్లో పొందే ఛాన్స్..
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
