మెడికల్ కళాశాల పనులు ప్రారంభించాలి

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య  భరద్వాజ్ కు విద్యార్థి సంఘం నాయకులు మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, DSF జిల్లా అధ్యక్షుడు దనాపురం ఉదయ్ PSA రాష్ట్ర అధ్యక్షుడు రాజు SSA రాష్ట్ర కార్యదర్శి  శివ ప్రసాద్ గౌడ్ PDSO డివిజన్ కార్యదర్శి శివ మాట్లాడుతూ. మెడికల్ కళాశాల పై కూటమి ప్రభుత్వం నిర్లక్షం వీడలని ఆదోని మెడికల్ కళాశాల అర్ధాంతరంగా పనులు నిలిపేసి కూటమి ప్రభుత్వం 66 సంవత్సరాలకు లీజుకి ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య ప్రజలకు సరైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో  రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలలో  ఏర్పాటు చేశారని కొనియాడారు. కానీ కూటమి ప్రభుత్వం విద్యార్థుల కడుపులు కొడుతూ ప్రైవేట్ పరం చేస్తూ PPP పద్ధతిలో కొనసాగిస్తామని ప్రభుత్వ నిర్ణయం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని  ప్రభుత్వ అధీనంలోనే మెడికల్ కళాశాలను కొనసాగించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top