June 1, 2025

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. మరియు పార్టీ నాయకులు పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ నాల్గవ తేదీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు, యువత నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ప్రజలు చంద్రబాబుకు పాలన ఇచ్చింది తమకు మేలు జరుగుతుందని ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని గెలిపిస్తే ఈ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెడ్ బుక్ పాలన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేయకుండా ముఖ్య నాయకుల పై సోషల్ మీడియా పై కేసులు పెడుతూ పరిపాలన సాగిస్తున్నారని అందువల్ల ఇప్పటినుంచి పోరాటాలు చేయకపోతే చాలా అరాచకాలు జరుగుతాయని తెలిపారు. ఈ ప్రభుత్వం అమరావతికి మాత్రమే అభివృద్ధికి కృషి చేస్తుంది కానీ గత వైసిపి ప్రభుత్వం లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందాలని ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నాలుగో తేదీ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

పోస్టర్ విడుదల చేస్తున్న నాయకులు
విలేకరుల తో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం దొడ్డనగేరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లో ఆట స్థలంలో పశువుల హాస్పిటల్  భవనం నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ DSF, NSUI ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు శనివారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, NSUI ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి బాలు మాట్లాడుతూ ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో విద్యార్థుల ఆటస్థలం ( గ్రౌండ్)లో నుంచి పొలాలకు, ఇండ్లకు వెళ్లే రోడ్డు గా మార్చేశారని అంతటితో ఆగకుండా ఆట స్థలంలో వాటర్ ట్యాంక్, షాపుల కోసం చాలా స్థలము ఆక్రమించారని విద్యార్థి సంఘం బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పశువుల హాస్పిటల్ కోసం భవన నిర్మాణం చేపడుతున్నారని ఇలా కట్టుకుంటూ వెళ్తే విద్యార్థులకు ఆట స్థలం ఎక్కడ మిగులుతుందని భవిష్యత్తులో భావితరాల విద్యార్థులకు ఆట స్థలం మిగలదని విద్యార్థి సంఘం నాయకులు ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో దాదాపుగా 1100 మంది విద్యార్థులు చదువుతున్నరని జూన్ 12 నాటికి పాఠశాలలు ఓపెన్ అయితే విద్యార్థులు ఎక్కడ ఆడుకోవాలని ప్రశ్నించారు. విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్లు విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.

ఆదోని 01 06 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 14/- రూపాయలు, రిటైల్: 1kg 16/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు

01 06 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

జిల్లాలో  సుమారు 8 వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం జరిగిన వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుండి ఈరోజు వరకు ఉపాధి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, ఉపాధి కూలీలను నష్టం చేస్తుందన్నారు. ఒకపక్క చాలీచాలని వేతనాలు, మరోపక్క నెలలు గడుస్తున్న వేతనాలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టడం ఉపాధి హామీని నిర్వీర్యం చేయడం కోసం చేస్తున్న కుట్ర లాగా కనిపిస్తుందని ఆరోపించారు.  ఉపాధి హామీ కూలీల ఐక్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న ,సహాయ కార్యదర్శి తిక్కన్న, ఆదోని, పెద్దకడబూరు, కౌతాళం, కోసిగి మండలాల ముఖ్య కార్యకర్తలు శ్రీనివాసులు, నాగేంద్ర, శంకర్, తదితరులు పాల్గొన్నారు.

వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూన్న బి. వీరశేఖర్