News
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం
కర్నూలు జిల్లా ఆదోనిలో సిరుగుప్ప టర్నింగ్ వద్ద వ్యవసాయ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ తెలిపిన వివరాల ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఎరువుల రవాణా చేస్తున్నారని సమాచారంతో సోమవారం అక్రమ రవాణాను అరికట్టుడాం కోసం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి పి. ఎల్. వరలక్ష్మి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, రవాణా మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బృందాలను బృందాలుగా ఏర్పడి శిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ వ్యవసాయ సహాయ సంచాలకులు బి.బాలవర్ధి రాజు, వ్యవసాయ అధికారి సి. అశోక్ కుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ ఐ పెద్దయ్య పాల్గొన్నారు.


News
బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

News
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.
News
ఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మం) కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటలకు షిఫ్ట్ డిజైర్, ఫార్చునర్ ఢీకొనడంతో షిఫ్ట్ డిజైర్లో ఉన్న ఐదు మంది కర్ణాటక వాసులు మృతి చెందారు.
ఫార్చునర్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులంతా కర్ణాటక కోలార్ జిల్లా బంగారు పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వరిలో ఒకే కుటుంబానికి చెందిన బార్య మీనాక్షి భర్త సతీష్ కుమార్ కుమారుడు రుతిక్ మామ వెంకటేష్ అప్ప బంధువుల పిల్లోడు బనిత్ గౌడ్ మృతి చెందారు. అత్త గంగమ్మ, డ్రైవర్ చేతన్ ఇద్దరు తీవ్రగాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్నారు.



ఫార్చునర్ కార్ లో ఉన్న నలుగురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆదోనిలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతున్నారు. ఫార్చునర్ కార్ లో ఉన్న అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదోనిలో వారి బంధువుల రిసెప్షన్ హైదరాబాదు నుంచి ఆదోని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.


-
News1 week agoఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
News3 weeks agoఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
-
News6 days agoపత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
-
News3 weeks agoమత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
-
News5 days agoబస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
-
News2 weeks agoపత్తి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు
-
News3 weeks agoఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
-
News3 weeks agoవైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం
