Connect with us

News

కర్నూల్ లో ఏ‌సి‌బి సోదాలు భారీగా నగదు ఆస్తులు స్వాధీనం

Published

on

కర్నూలు నగరంలో డి‌జి‌పి శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు కర్నూలు జిల్లా డివిజనల్ కో-ఆపరేటివ్ కార్యాలయం అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాతకు చెందిన ఇల్లు, కార్యాలయం తోపాటు కర్నూలు నగరం లోని ఐదు ప్రాంతలలోని ఆమె బంధువుల ఇళ్ళలో అవినీతి నిరోధక శాఖ(ఏ‌సి‌బి) కర్నూలు విభాగం అధికారుల బృందం ఉదయం నుండి ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత నుండి ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలు:
• కర్నూలు పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఒక G+2 ఇల్లు,
• కర్నూలు టౌన్ అశోక్ నగర్ కాలనీలో ఒక G+1 ఇల్లు,
• కస్తూరి నగర్ కాలనీ, కర్నూలు టౌన్ లో ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్‌లో G+1 దుకాణంతో కూడిన ఇల్లు
• బుధవారిపేట, కర్నూలు టౌన్‌లో మరో దుకాణం
• కర్నూలు మండలం సుంకేసుల గ్రామంలో 2.50 ఎకరాల వ్యవసాయ భూమి.
• కర్నూలు పట్టణం శివారు ప్రాంతంలో రూ.23,16,000/- విలువ చేసే ఎనిమిది ఇళ్ల స్థలాలు
• 40 తులాల బంగారం
• ఒక ఫోర్ వీలర్ (టాటా విస్టా) కారు, ఒకటి 2 వీలర్.
• ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, బంగారం మరియు గృహోపకరణాలు
• రూ. 8,21,000/- నగదు

అసిస్టెంట్-రిజిస్ట్రార్ శ్రీమతి ప్రేమరపోగు సుజాత ఇంట్లో ఇంకా ఏ‌సి‌బి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.

అవినీతి అధికారులపై ప్రజలు ఫిర్యాదు కోసం 14400 అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబర్ ను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే ప్రజలు ఈ నెంబర్ ద్వారా అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించవచ్చని డి‌జి‌పి రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

కర్నూల్ లో ఏ‌సి‌బి సోదాలు చేస్తున్న వీడియో

News

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు  ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

Continue Reading

News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

మృతదేహాన్ని తరలిస్తున్న ఫోటో
Continue Reading

News

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

Published

on

ఎమ్మిగనూరు, మే 13:

లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..

ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. సోమన్న, ఏసీబీ డీఎస్పీ

Continue Reading
News2 weeks ago

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

News2 weeks ago

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

News1 month ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News1 month ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News2 months ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News2 months ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

News2 months ago

పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి విద్యార్థులకు తీవ్ర గాయాలు

News3 months ago

ఆస్తి కోసం తండ్రి పై కత్తి తో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

News3 months ago

ఆదోనిలో గ్యాస్ దాడులు 107 సిలిండర్లు సీజ్

Trending