కర్నూలు జిల్లా ఆదోనిలో తేదీ 14.09.2024 శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా లో అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. రెండవ శనివారం నిర్వహణ కారణంగా 11 కెవి శక్తి గుడి ఫీడర్ మరియు 11 కెవి హాస్పిటల్ ఫీడర్ పరిధిలో ఉన్నా గణేష్ సర్కిల్, హవానాపేట స్కూల్, బుడ్డేకల్, శక్తిగుడి, బావాజీపేట, శ్రీనివాస భవన్ ఏరియా, మేదర్ గెరి, ఎల్‌బి వీధి, సంతపేట ప్రాంతలకు విద్యుత్ […]
కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటు
సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి పోరాటయోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష ఉద్యమానికి మరియు దేశానికి తీవ్ర నష్టదాయకమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, కే. వెంకటేశులు ఆవేదన వ్యక్తం చేశారు.కర్నూలు జిల్లా ఆదోనిలోని సిఐటియు కార్యాలయంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి, సంతాపం వ్యక్తం చేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడాతూ 1952లో […]
నకిలీ కులదృవీకరణ పత్రంలను అందించిన అధికారులపై చర్యలు తీసుకోండి
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ మరియు డివిజనల్ మెజిస్ట్రీట్ మౌర్య భరద్వాజ్ కు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవి కుమార్ కర్నూల్ జిల్లా మెంబర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ రాజు, ఎరుకలక్కల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కృష్ణ, మంత్రాలయం అధ్యక్షుడు బజారి, హనుమేష్ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ కౌతాళం తహశీల్దార్ కె. మల్లిఖార్జున స్వామి, కౌతాళం డిప్యూటీ తహశీల్దార్ […]
కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు జి.జి.హెచ్ వద్ద నిరసన
ఆదోని జనరల్ ఆస్పత్రి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు తమకు న్యాయం చేయాలంటూ జి.జి.హెచ్ వద్ద నిరసన చేపట్టారు. జీఓ 115 రద్దు చేసి కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేయాలంటూ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. నర్సులకు అన్యాయం జరుగుతుందని వెంటనే ఆ జీవో ను రద్దు చేసి తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
వినాయకుడి శోభయాత్ర ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర ఘనంగా ప్రారంభం ఆయాయి. విశ్వహిందూ పరిషత్ లో ఎర్పాటు వినాయక విగ్రహానికి తొలి పూజ చేసి లడ్డు వేలం పాట నిర్వహించారు మహేందర్ రెడ్డి 1 లక్ష 55 వేలకు పలికి స్వాధీనం చేసుకోగా హుండీని 2 లక్షల 10 వేల రూపాయలకు డాక్టర్ విజయ్ తీసుకొన్నారు. అనంతరం శోభయాత్రను ఎమ్మెల్యే పార్థసారథి ట్రాకర్ నడిపి ప్రారంభించరు. పట్టణంలోని ప్రధాన రహదారులగుండా శోభ యాత్రను నిర్వహించి ఎల్ ఎల్ […]
2వ తరగతి చదువుతున్న విద్యార్థి ఔదార్యం
వరదబాధిల సహాయార్థం పిల్లలందరూ ఎంతోకొంత సహాయం చేయమని సామాజిక స్పృహ కలిగించే విధంగా పిలుపునివ్వడముతో వెంటనే స్పందించిన కిడ్డీస్ రూట్స్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న వెల్లాల యాగ్నిక్ తను హుండీలో కూడబెట్టిన 2080రూపాల డబ్బు మొత్తాన్ని స్కూల్ ఏర్పాటు చేసిన వదరబాధితుల సహాయార్థం హుండీలో వేసి ఔదార్యాన్ని చాటుకున్నారు కర్నూలు జిల్లా ఆదోని పట్టణములోని కిడ్డీస్ రూట్స్ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న వెల్లాల హరిణికిరణ్ దంపతుల కుమారుడు యాగ్నిక్ శర్మ తన తల్లిదండ్రుల మరియు […]
జోలిపట్టి భిక్షాటన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి..
విజయవాడ వరద బాధితులకు సహాయ అర్థం పట్టణంలోని ప్రధాన రహదారుల మీద జోలిపట్టి భిక్షాటన చేశారు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి.. కర్నూల్ జిల్లా ఆదోని లో స్థానిక బీమాస్ హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిరు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ విజయవాడలో వరదల్లో నష్టపోయిన అనేక కుటుంబాలు ధన , ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగిందని ఆవేదన వేక్తం చేశారు. నష్టపోయిన ప్రజలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ తనవంతు సహాయం అందించాలని […]
అదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 08 09 24: రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 48/- రూపాయలు, రిటైల్: 1kg 50/- రూపాయలు
మంత్రాలయం శ్రీ మఠంలో మట్టి గణపతి కి పూజలు
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం లో వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహానికి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. అంతకు ముందు వేద పాఠశాల నుంచి శ్రీ మఠం వరకు గణనాథు విగ్రహాని పల్లకిలో ఊరేగింపు గా శ్రీ మఠం వరకు తీసుకుని వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు.
కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు..సీఎం చంద్రబాబు
◆ కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాలేదు..సీఎం చంద్రబాబు అమరావతి: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం వరద సాయంగా రూ.3,300 కోట్లు ఇచ్చిందనేది ప్రచారం మాత్రమేనని సీఎం చంద్రబాబు అన్నారు. సాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. వరద నష్టంపై ప్రాథమిక అంచనా రిపోర్టు రూపొందించి రేపు ఉదయం కేంద్రానికి పంపిస్తామని సీఎం స్పష్టం చేశారు. బాధితులకు సాయం విషయంలో కేంద్రంతో పాటు బ్యాంకర్లతో మాట్లాడుతున్నామన్నారు. బీమా కట్టిన వారందర్నీ త్వరగా ఆదుకోవాలని కోరుతున్నామని తెలిపారు.