తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను లేఖలో ప్రస్తావించారు. విభజన హామీల పరిష్కారానికి కలిసి చర్చించుకుందామని ఈ సందర్భంగా కోరారు. విభజన జరిగి పదేళ్లు దాటినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. పరస్పర సహకారం.. తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని లేఖలో తెలిపారు. ఈనెల 6న ముఖాముఖి కలిసి చర్చించుకుందామని చంద్రబాబు లేఖలో ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాలను సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లు చంద్రబాబు లేఖలో వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *