కర్నూలు జిల్లా కోసిగి మండలం దేవరబెట్టు గ్రామంలో ఓ తల్లి పది నెలల కొడుకును గొంతు నలిపి చంపి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన బుధవారం తుంగభద్ర పాత రైల్వే స్టేషన్ స మీపంలో చోటుచేసుకుంది. దేవరబెట్టు గ్రామానికి చెందిన కొండ రామాంజనేయులు ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన హనుమంతమ్మకు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది వీరికి ఒక కుమార్తె ఒక కొడుకు ఉన్నారు గత కొన్ని నెలలుగా హనుమంతమ్మ మానసిక స్థితి సరిగ్గా లేక భర్త రామాంజనేయులు తో గొడవపడి పుట్టినిల్లు కి వెళ్ళింది. బుధవారం సాయంత్రం తన పది నెలల విశ్వనాథ్ ను ఎత్తుకొని తుంగభద్ర పాత రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్లి చిన్నారి గొంతు నలిపి చంపేసింది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళింది. సరిగ్గా సమయానికి అమెను వెతుక్కుంటూ అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు స్థానిక లు ఆమెను అడ్డుకున్నారు. అయితే ఆ తల్లి సంకలో నిర్జీవిగా ఉన్న విశ్వనాథుని చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనతో విషాదంతో దేవరబెట్టు మునిగిపోయింది.

ఫ్యామిలీ ఫోటో

భాషను మార్చుకోవడానికి ఈ క్రింది వీడియోని చూడండి

యూట్యూబ్ వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *