2024 ఎమ్మెల్యే ఎన్నికల్లో జై భీమ్ రావ్ భారత్ పార్టీ నుండి కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గనికి ఎమ్మెల్యేగా మాజీ కౌన్సిలర్ కల్లుబోతుల రంగన్న పోటీ చేశారు. ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన ప్రజాదరణ పొందలేక ఓటమి చెవి చూశారు మాజీ కౌన్సిలర్ కల్లుబోతుల రంగన్న. కొన్ని అనివార్య కారణాలవల్ల జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధిష్టానానికి చరవాణి ద్వారా రాజీనామను తెలిపినట్లు విలేకరులకు సమాచారం అందించారు. పార్టీ పెద్ద వారు సానుకూలంగా స్పందించరని తెలిపారు. తదుపరి భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని మాజీ కౌన్సిలర్ కల్లుబోతుల రంగన్న తెలిపారు.