కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న 17 మంది పేకాటరాయుళ్లను తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 స్కూటర్లు 13 సెల్ ఫోన్లు, నగదు సుమారు 93వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఇంకా 6 మంది పేకాట రాయుళ్లు పరారైనట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.