తొలిఅడుగులోనే యువనేత నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మంగళగిరి: ఉండవల్లి నివాసంలో ప్రజలను కలుసుకున్నరు. శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజలకోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు “ప్రజాదర్బార్” ను నిర్వహించారు. శనివారం ఉదయం 8గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తెచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశారు. స్థానికేతర కార్యక్రమాలకు వెళ్లినపుడు మినహా ఉండవల్లిలో ఉన్నపుడు ప్రతిరోజూ ఉదయం లోకేష్ స్థానిక ప్రజలను అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ప్రజానేతగా లోకేష్ వేసిన ఈ తొలిఅడుగు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు మార్గదర్శకం కానుంది. శనివారం జరిగిన కార్యక్రమంలో మంగళగిరి ప్రజలు పలు సమస్యలు నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. తక్షణమే సమస్యల పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చెయ్యాలని అధికారులకు ఆదేశించారు.

అర్జీలను స్వీకరిస్తున్న నారా లోకేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *