కర్నూలు జిల్లా ఆదోని మండలం , సలకలకొండ గ్రామం లో చిరుత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఆదోని అడవి అటవీశాఖ FRO తేజస్విని ఘటనా స్థలాన్ని చేరుకునీ చిరుత మృత దేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని తరలించారు.
పొలం యజమాని ఉరుకుంద రెడ్డి చెప్పిన వివరాల మేరకు అలసందగుత్తి గ్రామంలో పొలం పనులకు వెళ్తున్న గ్రామస్తులు ఉరుకుంద రెడ్డి పొలంలో చిరుత పులిని చూసి పరుగులు తీశారని , అయితే కాసేపు దూరం నుండి గమనించాక చిరుత కదలక పోవడంతో దగ్గర వెళ్లి చూసి , మృతి చెందినట్లు గుర్తించి పొలం యజమానికి తెలిపారు. విషయం తెలుసుకున్న ఉరుకుంద రెడ్డి పొలం వచ్చి చిరుతను పరిశీలించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.గతంలో కూడా చిరుత పులుల సంచారం పై పలుమార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిరుతలను అడవికి తరలించారని కోరారు.