కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం యంత్రాల పని తీరుపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం సబ్ కలెక్టర్ ఆవరణంలో డి ఎల్ పి ఓ కార్యాలయపు పరిపాలన అధికారి వీరభద్రప్ప ఆధ్వర్యంలో ప్రజలకు ఈవీఎం యంత్రాల పని తీరుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈవీఎం యంత్రాలపై మరియు బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌ల పని తీరుపై అవగాహన కల్పించారు. ఎన్నికల్లో ఓటర్లు తడబాటుకు గురికాకుండా యంత్రాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇందుకోసం డెమో ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.

ఈవీఎం యంత్రాల పని తీరుపై అవగాహన కల్పిస్తున్న డి ఎల్ పి ఓ అధికారి వీరభద్రప్ప

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *