News
అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలి. జెసి నారపురెడ్డి మౌర్య
కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని సిల్వర్ జూబ్లీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “జగనన్నకు చెబుదాం-స్పందన” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ “జగనన్నకు చెబుదాం-స్పందన” కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు సంబంధిత అధికారులు ఎలా అంటే అలా ఎండార్స్మెంట్ లు ఇవ్వకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఎండార్స్మెంట్ లు ఇవ్వాలని అపుడే రీ ఓపెన్ కేసుల శాతం తగ్గే అవకాశముందని అన్నారు .
ముఖ్యంగా ఆర్జీలలో రెవెన్యూ కి సంబంధించి మిగులు భూమి, అడ్డంగల్ కరెక్షన్స్ లాంటి పరిష్కారమయ్యే చిన్న చిన్న సమస్యలకు కూడా అర్జీదారులు కర్నూలు జిల్లాకు వచ్చి మరి అర్జీలు ఇస్తున్నారని ఇక్కడ మీ పరిధిలో పరిష్కారం అయ్యే వాటికి ఇక్కడే పరిష్కారం చేయాలని, పరిష్కారం చేయలేని వాటికి ఎందుకు చేయలేకపోతున్నాము అనేది కూడా స్పష్టంగా ఎండార్స్మెంట్ లో వివరించాలన్నారు. లబ్ధిదారులకు కేటాయించిన టిడ్కో ఇళ్ళలో 3 నెలలు నుండి కరెంట్ బిల్లులు కట్టలేదని వారి ఇళ్ళ వద్దకు వెళ్లి కరెంట్ కనెక్షన్ కట్ చేస్తున్నారని మీడియా ప్రతినిధులు స్పందనలో జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా అటువంటి సమస్యల పై తగిన చర్యలు తీసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటానని తెలిపారు..తొలుత స్పందన కార్యక్రమం కంటే ముందు అర్జీలు నమోదు చేసే కేంద్రాన్ని పరిశీలిస్తూ అర్జిదారుడు ఇచ్చిన అర్జీ కి సంబంధిత విభాగం కింద తప్పులు లేకుండా నమోదు చేయాలని ఎన్రోల్మెంట్ ఆపరేటర్లకు జాయింట్ కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి, ఆదోని తహసిల్దార్ వెంకట లక్ష్మీ, ఆదోని మునిసిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంపిడిఒ గీత వాణి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్‌ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
