కర్నూలు జిల్లా ఆదోని కస్తూరిబా స్కూల్లో చదువుకున్న విద్యార్థిని శివలింగమ్మ 10వ తరగతిలో 541 మార్కులతో పాస్ అయినందుకు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంన్న శివలింగమ్మ శనివారం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ని కలిసి ఆశీర్వాదం పొంది తనకు ఈ అవకాశం వచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపింది.
ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన సోమనాథ్ గంగమ్మ నాలుగో సంతానం శివలింగమ్మ అమెరికా వెళ్లి ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే ఆరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవడమే ఈ అమ్మాయి సాధించిన గొప్ప విజయం అని అభినందనలు తెలిపారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపు తో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులను అమెరికాలోని అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం, కొలంబియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రాధిక అయ్యంగార్ తో మీటింగ్ తోపాటు వరల్డ్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ప్రతినిధులతో సమావేశం, వైట్ హౌస్ సందర్శన కల్పించారు అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానంలో సమూలమైన మార్పులు విద్యారంగంలో సంస్కరణ లపై ఐక్యరాజ్యసమితిలో మాట్లాడేందుకు విద్యార్థులను అమెరికా పంపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు

అమెరికా వెళ్లి అమ్మాయికి అభినందనలు తెలుపుతున్న ఎమ్మెల్యే
తన వంతు ఆర్థిక సహాయం అందిస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *