కర్నూలు జిల్లా ఆదోని శాంతి ఎస్టేట్ లో ఉన్న అత్త మామలపై అల్లుడు శివరాజ్ రాళ్లతో దాడి చేసి అత్త , మామలతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. మామ విరుపాక్షి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ ఇచ్చిన వివరాల మేరకు భార్య లక్ష్మీపై అనుమానం పెంచుకొని తరచూ దాడికి పాల్పడేవాడని అయితే శుక్రవారం రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో తాగి ఇంటిపై రాళ్లతో దాడి చేశాడని ఈ దాడిలో శివరాజ్ కొడుకు వివేక్ కి కంటికి, మామ విరుపాక్షికి తీవ్ర గాయాలు, ముగ్గురు మహిళలకు ఇంకొక వ్యక్తికి తలకు చేతులకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.